Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్దచర్చను లేవదీసే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చాలా బాగా పరిపాలిస్తున్నారని కితాబునిచ్చారు. బాల్ థాకరే, మహాత్మాగాంధీల కంటే బాగా కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ను చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎలా పని చేయాలో నేర్చుకోవాలని ఆయన సూచించారు. అలాగే తాను తెలంగాణ వాడినని వర్మ మరో ట్వీట్ లో స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ లో పుట్టిపెరిగినందువల్ల తెలంగాణ వాడినని వర్మ పేర్కొన్నారు.

More Telugu News